జ్యేష్టమాసి, సితేపక్షే, దశమ్యాం, బుధ హస్తయో, వ్యతీపాతే, గరానందే, కన్యాచంద్రే, వృషౌరవౌ|| “ జ్యేష్ట మాసము, శుక్లపక్షం, దశమి, వ్యతీపాత యోగము, గర కరణము, బుధవారము,హస్తా నక్షత్రములున్నందు వలన ఆనంద యోగము, కన్య యందు చంద్రుడు, వృషభమందు రవి, ఇవి పదిరకాలైన కాల విశేషాలు. ఈ పదీ కలిసి వచ్చిన రోజును దశపాప హర వ్రతము చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే దశపాప హర వ్రత లక్షణములు. దశ పాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఇది జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకూ చేస్తారు. పంచాంగంలో కూడా దశహరాదశాశ్వమేథేస్నానమ్‌; ఇతి ఆరభ్య దశమీ పర్యంతమ్‌ అని ఉంటుంది. అనగా ఈ రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలముంటుంది. ముఖ్యంగా గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందునా కాశీలో దశాశ్వమేధ ఘట్టంలో గంగాస్నానం సంపూర్ణ పుణ్య ఫలం!

Event information

  • Event: Dasa papa hara vratham
  • Location: Kasi
  • Event date: 12.06.2019

Image Gallery

Scan the code